బడ్జెట్ ఎఫెక్ట్‌: రెండో రోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. జైట్లీ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికీ నిఫ్టీ, సెన్సెక్స్‌ల సూచీలు పాతాళానికి పడిపోయాయి. సాయంత్రం ట్రేడింగ్ నిలిచేసమయానికి కూడా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. కాగా, రెండో రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.  ఆరంభంలోనే సెన్సెక్స్ 250 పాయింట్లు పైగా కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 11 వేల మైలు రాయి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 402 పాయింట్లు దిగజారి 35,504 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో 10,888 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష దాటితో 10 శాతం పన్ను విధిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి జైట్లీ నిన్న లోక్‌సభలో ప్రకటించారు.