సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ షురూ..।

 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా నియమితులైన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన వాల్తేర్ డివిజనల్ మేనేజర్ తో పాటు రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసే అంశాలను చర్చించారు. మరోవైపు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు. 

అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్లో పూర్తిగా ఒడిస్సా ప్రాంతం కలుపుతూ డివిజన్ పరిధిలో నిర్ణయించారు. కానీ వాల్తేర్ డివిజన్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాలు మాత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వెళ్లాయి. ఆరోగ్యంగా పలాస ఇచ్చాపురం... ఇటు కొత్తవలస నుంచి అరకు ప్రాంతం ఇతర డివిజనల్ లో ఉన్నాయి ఈ దశలో అరకు తో పాటు ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే ప్రాంతాన్ని విశాఖపట్టణం డివిజన్లో ఉంచుతూ సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. 

ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అరకు ఎంపీ డాక్టర్ తనుజా రాణి ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు రైల్వే అధికారులకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఈ దశలో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన జనరల్ మేనేజర్ త్వరలోనే రైల్వే బోర్డు అధికారుల నిర్ణయం మేరకు పరిధులు మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు డి పి ఆర్ ను సవరించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇలా ఉండగా ఏపీ విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయి ప్రక్రియ మాత్రం ఇప్పుడే మొదలైంది. ఈ దశలో ఆంధ్ర ప్రాంతంతో కూడిన రైల్వే స్టేషన్లు విశాఖ డివిజన్లో ఉండే రీతిన పరిధులు మార్చాలని అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu