విశాఖలో... రెండో వైపు చూస్తే కచ్చితంగా భయపడతారు..! 

ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌వన్ మెట్రోపాలిటిన్ సిటీ విశాఖ... అంతేకాదు విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి కాదు... రెండు కాదు... వందలకొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం.... ముఖ్యంగా విశాఖకు మెయిన్ అస్సెట్... సీ కోస్ట్.... సముద్ర తీరం వెంబడి ‎మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్‌లో సహజసిద్ధ అందాలెన్నో కనిపిస్తాయి.... అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ.... అలాగే, దేశంలోనే అతిపెద్ద నాలుగో ఓడరేవు కలిగిన నగరం వైజాగ్‌.... భారత నౌకాదళ తూర్పు ప్రధాన స్థావరం కూడా విశాఖలోనే ఉంది.... ఇక, సుందరమైన సముద్ర తీరం... ఆహ్లాదకరమైన వాతావరణం... పచ్చని కొండలు... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... చూడచక్కని సముద్ర తీరం... కళ్లు చెదిరే ప్రకృతి అందాలు...  ఇలా చెప్పుకుంటూ పోతే.... ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్‌కి ఉన్నాయి.... అయితే, ఇవన్నీ ఒకవైపే... ఎందుకంటే, రెండో వైపు చూస్తే ఎవరైనాసరే వామ్మో అనకమానరు.

ఇండియన్ స్మార్ట్ సిటీస్‌లో ఒకటైన విశాఖను నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ బీచ్‌ల్లో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. సముద్రపు ఒడ్డున అలలతో ఆటలాడుతూ అంతులేని ఆనందాన్ని పొందుతుంటారు. అయితే, విశాఖ నగరానికి మణిహారంగా నిలుస్తోన్న సాగర తీరం కాలుష్య కోరల్లో కూరుకుపోతోంది. లాసన్స్ బే కాలనీ నుంచి వస్తున్న మురుగునీరు జాలారిపేట తీరంలో కలుస్తుండటంతో సాగరం చెత్తాచెదారంతో నిండిపోతోంది. ఈ కాలుష్యం కారణంగా పర్యాటకులే కాదు, స్థానికంగా నివసించే మత్స్యకారులు కూడా రోగాల బారినపడుతున్నారు.

విశాఖ బీచ్‌ల్లోకి పెద్దఎత్తున మురుగు నీరు, మానవ విసర్జితాలు, కాగితాలు, బట్టలు, సబ్బులు, డిటర్జెంట్లు, కెమికల్స్ మొదలైన వ్యర్ధాలతో నిండిపోతుండటంతో సాగర తీరం డంపింగ్ యార్డుగా మారిపోతోంది.ఇలా, ఎన్నో పర్యాటక, చారిత్రక అందాలకు నెలవైన విశాఖలో పర్యావరణ హననం ఆందోళన కలిగిస్తోంది. ‎స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో వేలకోట్లు ఖర్చు చేస్తున్నా, కాలుష్యాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. దాంతో, మురికివాడల్లోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరి, ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా రాజధానిగా మారుతోన్న విశాఖ మహానగరాన్ని కాలుష్య కోరల్లో నుంచి జగన్ ప్రభుత్వం బయటపడేస్తుందో లేదో చూడాలి.