అది తప్ప అన్ని ఇచ్చాం.. మోదీని ట్యాగ్ చేయండి.!!

ఏపీ ప్రభుత్వమే కాదు ఏపీ ప్రజలు కూడా ఏపీకి జరిగిన అన్యాయం గురించి కేంద్రం మీద మండిపడుతున్నారు.. యువత సోషల్ మీడియా వేదికగా కేంద్రాన్ని నిలదీస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.. వాటిల్లో కొన్ని ఆసక్తిగా ఉంటున్నాయి.. వైరల్ కూడా అవుతున్నాయి.. అలాంటి వాటిల్లో ఒకటే 'అది తప్ప అన్ని ఇచ్చాం' అనే పోస్ట్.

 

 

ప్రత్యేకహోదా నుండి ఇతర విభజన హామీల వరకు కేంద్రాన్ని ఏది అడిగినా.. కేంద్రం నుండి ఒకటే సమాధానం.. అది తప్ప అన్ని ఇచ్చాం.. ప్రశ్న ఏపీది అయితే చాలు, మా సమాధానం ఇదే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది.. ఇదే విషయాన్ని ఒకరు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఇప్పుడు ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

ప్రత్యేక హోదా అడిగితే.. అది తప్ప అన్ని ఇచ్చాం.
రైల్వే జోన్.. అది తప్ప అన్ని ఇచ్చాం.
కడప ఉక్కు ఫ్యాక్టరీ.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
విశాఖ రైల్వే జోన్.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
దుగ్గిరాజు పట్నం పోర్టు.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
లోటు బడ్జెట్.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
పోలవరం నిధులు.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
రాజధాని నిర్మాణం.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
విజయవాడ, విశాఖ మెట్రో.. అది తప్ప అన్ని ఇచ్చాం. 
జాతీయ యూనివర్సిటీలకు పూర్తి నిధులు..అది తప్ప అన్ని ఇచ్చాం.

'అది తప్ప అన్ని ఇచ్చాం అంటూ అన్నింటిని భలే తప్పించుకొని తిరుగుతుందిగా కేంద్రం' అని సోషల్ మీడియాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.. కొందరైతే ఇదే పోస్ట్ ని హిందీలో రాసి మోదీని ట్యాగ్ చేయాలంటూ ఛలోక్తులు విసురుతున్నారు.. మన పిచ్చి కానీ పోరాటం చేస్తేనే దిగిరాని కేంద్రం పోస్ట్ లు పెడితే దిగొస్తుందా? చెప్పండి.