బ్యాక్ టు పరప్పన జైలు...

 

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్సి శశికళ తిరిగి బెంగుళూరు జైలుకు బయల్దేరినట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఆమె భర్త నటరాజన్ ఆరోగ్యం సరిగా లేని కారణంతో ఆమె పెరోల్ కింద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన భర్తను చూడటానికి అనుమతి ఇవ్వాలని శశికళ పెరోల్ కు ధరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. కొన్ని షరతులతో కూడిన పెరోల్ ను మంజూరు చేశారు జైలు అధికారులు. ఆమె తన బంధువుల నివాసంలో మాత్రమే ఉండాలని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, మీడియా ప్రకటనలు చేయరాదని నిబంధనలు విధించింది. అయితే ఆమెకు ఇచ్చిన ఐదు రోజుల గడువు ముగియడంతో ఆమె మళ్లీ తిరిగి జైలుకు బయల్దేరారు. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నటరాజన్‌కు కిడ్నీ, కాలేయ మార్పిడి చేశారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.