రేప్‌లు మామూలే: సమాజ్‌వాది బలుపు

 

 

 

ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అని చెప్పినంత ఈజీగా ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో వున్న సమాజ్‌వాది పార్టీ ‘పెద్ద రాష్ట్రాల్లో రేప్‌లు మామూలే’ అని బాధ్యతారహితమైన ప్రకటన ఇచ్చింది. యు.పి.లోని బదౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద అత్యాచారం చేసి చెట్టుకి ఉరేసి చంపిన సంఘటన దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించింది. దేశమంతా ఈ సంఘటన గురించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, సమాజ్‌వాది పార్టీ నాయకులు మాత్రం ఈ సంఘటని చాలా తేలిగ్గా తీసిపారేస్తూ రోజుకో విచిత్రమైన ప్రకటన ఇస్తున్నారు.

 

తాజాగా ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు సహజమని సమాజ్‌వాది పార్టీ నేతలు ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెబుతున్నారు.  దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమేనంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొహిసిన్ ఖాన్ గురువారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చెప్పి అందరికీ జ్ఞానోదకం కలిగించాడు. 



అత్యాచారాలు ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ఆయన అనుకూల వర్గం మొత్తం ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ నాయకుడి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు.