TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మృత్యుంజయురాలు రాప్తాడు బాలిక: బాలిక: కోలుకుని చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు వైరల్.!

Published on: Wed Nov 25, 2026 10:59PM

మణిపాల్ ఆస్పత్రిలో చిన్నారి చేత కేక్ కట్ చేయించిన వైద్యులు, సిబ్బంది
వీడియో షేర్ చేసిన మంత్రి లోకేష్

అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ ఉన్మాది పాశవికంగా చెట్లు నరికే రంపంతో జరిపిన దాడిలో   తీవ్రంగా గాయపడిన బాలిక మృత్యువును జయించి కోలుకుంది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెలో   ధైర్యం, ఉత్సాహం నింపేందుకు ఆసుపత్రి వైద్యులు  సిబ్బంది కేక్ కట్ చేయించి  సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతోంది. ఈ వీడియోను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం,   ఊహించిన దానికంటే వేగంగా బాలిక ఆరోగ్యం మెరుగుపడింది. దాడి సమయంలో తీవ్రమైన గాయాలపాలైన ఆమెకు నిపుణులైన వైద్యుల బృందం పలు దఫాలుగా ప్లాస్టిక్ సర్జరీలు,  శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. నిరంతర వైద్య పర్యవేక్షణ, సమగ్ర చికిత్స ఫలితంగా ఆమె పరిస్థితి  కుదుటపడింది.  ఆసుపత్రి గదిలోనే కేక్ కటింగ్,  ఉత్సాహభరిత వాతావరణంతో నిర్వహించిన ఈ కార్యక్రమం బాలికలో మానసిక స్థైర్యాన్ని పెంచడానికి దోహదపడిందని వైద్య సిబ్బంది తెలిపారు.

బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేష్ తొలి నుంచీ ప్రత్యేక దృష్టి సారించి, వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బాలిక కోలుకుంటుండటం ఎంతో సంతోషకరమైన విషయమని లోకేష్ పేర్కొన్నారు. చిన్నపాటి ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవని, బాలికలో ఆత్మవిశ్వాసం నింపేలా ఆసుపత్రి బృందం చేసిన ఏర్పాట్లు అభినందనీయమని లోకేష్ పేర్కొన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ చిన్నారి మరింత త్వరగా, పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతురాలిగా మారాలని ఆకాంక్షించారు. 

వైరల్ అవుతున్న కేక్ కటింగ్ వీడియోపై సామాన్య ప్రజలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  రాప్తాడు ఉన్మాది దాడి.. మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని బెంగళూరుకు తరలింపు.!​

 అదలా ఉంటే.. లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆ బాలిక చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం అందరిని కదిలిస్తోంది. కొన ప్రాణంతో ఆస్పత్రిలో చేరిన బాలిక మెరుగైన వైద్య చికిత్సతో కోలుకుంటూ నవ్వుతూ కనిపించడం పట్ల సర్వత్రా ఆనందం, హర్షం వ్యక్తం అవుతోంది. 

తొలి నుంచీ బాలిక ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరిపి ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్స్ ఇచ్చిన లోకేష్ పై కూడా నెటిజనులు, జనులు ప్రశంసల వర్షం కురిసిస్తున్నారు.   అలాగే చిన్నారి ముఖంలో మళ్లీ చిరునవ్వు పూయించేందుకు, ఆమెను ఉత్సాహపరిచేందుకు  చొరవ తీసుకున్న మణిపాల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది.

మీకు నచ్చవచ్చు: రాప్తాడు బాధిత బాలికకు అండగా నారా లోకేష్‌.. 48 గంటలు కీలకమన్న వైద్యులు. !​

రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు: అనంతపురం జీజీహెచ్‌లో అర్ధరాత్రి శస్త్రచికిత్స.!

[Raptadu Attack, Victim, Recovered, Manipal, Hospital, Lokesh, Shre, Video, TeluguOne]