రాప్తాడు ఉన్మాది దాడి.. మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని బెంగళూరుకు తరలింపు.!
Published on: Sat Oct 31, 2026 5:59PM

విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి నారా లోకేష్ ముందుగానే మణిపాల్ ఆస్పత్రి ఉన్నతస్థాయి వైద్యులతో మాట్లాడారు. బాలికను వేగంగా బెంగళూరుకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన క్షణం నుంచే మంత్రి లోకేష్ అప్రమత్తమయ్యారు. పోలీసు, విద్యాశాఖ, జిల్లా అధికార యంత్రాంగంతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స, తరలింపు ఏర్పాట్లపై అధికారులతో, వైద్యులతో ఎప్పటికప్పుడు సమీక్షించారు.
బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నారు.
[ Rapthadu Incident, Anantapur, Student Attack, Class 10 Student, Nara Lokesh, Andhra Pradesh Government, Bengaluru Manipal Hospital, Green Channel, Better Medical Treatment, School Attack, Student Health Condition ]


