కోర్టు ఆదేశాలను ధిక్కరించి శశికళ రెండో వివాహం..

 

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు, దినకరన్ వర్గీయురాలు శశికళ పుష్ప రెండో వివాహం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఆమె రెండో వివాహం చేసుకుంది. శశికళ పుష్ప మొదటి భర్త లింగేశ్వరతో విభేదాలు తలెత్తడంతో ఆమె అతడినండి విడాకులు తీసుకుంది. ఆ తరువాత న్యాయవాది, ప్రొఫెసర్ రామస్వామితో ఆమె వివాహానికి సిద్దమయ్యారు. అయితే ఇది తెలిసిన వెంటనే రామస్వామి మొదటి భార్య.. తామిద్దరికీ గతంలోనే పెళ్లయిందని, రిజుస్న అనే కుమార్తె కూడా ఉందని ఆరోపిస్తూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. సాక్ష్యాధారాలుగా ఫొటోలను కూడా చూపించారు. అంతేకాదు కోర్టును కూడా ఆశ్రయించడంతో....విచారణ ముగిసేంత వరకు రామస్వామి వివాహం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ శశికళ, రామస్వామిలు నిన్న వివాహం చేసుకున్నారు.