పురంధరేశ్వరి...మాట

 

Purandeswari made it clear, Purandeswari, telangana, congress, samaikyandhra, telangana state

 

....సాయి లక్ష్మీ మద్దాల

 

 

ఆంధ్ర రాష్ట్ర విభజన విషయమై కేంద్రం వెనక్కి వెళ్ళడం సాధ్యపడదని, విభజన ఆగదని కేంద్ర మంత్రి పురంధరేశ్వరి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇప్పుడు సీమాంధ్ర ప్రాంత ప్రజలు సమైఖ్య ఉద్యమాన్ని నిలుపుదల చేసి తమ ప్రాంతానికి జరగవలసిన సమన్యాయం కోసం పోరాటం చేయాలని తమకు కేంద్రం నుంచి ఏది కావాలో కోరుకోవటం మంచిదని సీమాంధ్రులకు సలహా ఇస్తున్నారు. లేదూ ఇలాగే సమైఖ్య రాష్ట్రం అనే నినాదం తో ఉద్యమాన్ని, ఆందోళనను కొనసాగిస్తే కేంద్రం నుంచి సీమాంధ్ర ప్రాంతానికి అందవలసిన న్యాయం అందదని, సీమాంధ్రులను హెచ్చరిస్తున్నారు. తాము ప్రభుత్వం లో ఉండి చాలా పోరాటం చేసామని, అయినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. కాని ఆమె ఒక విషయాన్ని గమనించాలి. ఆమె ప్రభుత్వం లో ఉండి పోరాటం చేసాము అనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే ప్రజలు ఉద్యమం చేసున్నారు అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆమె ఈ ప్రకటన చేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసి ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తుందని సీమాంధ్రులు భావించే అవకాశం లేకపోలేదు.



ఇలాంటి ప్రకటన చేయటం ద్వారా ఆమె రాజకీయ విరోధి ఐన చంద్రబాబు ను దెబ్బతీయటానికి కాంగ్రెస్ అధిష్ఠానం పన్నిన కుట్రలో ఆమెకూ భాగస్వామ్యం ఉందని పలువు భావిస్తున్నారు. కాంగ్రెస్ బద్ధవిరొధిగా రాజకీయజీవితం గడిపిన రామారావు గారి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన్చగలిగారు అంటేనే కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఆమెకు ఎంత పలుకుబడి ఉందో ప్రజలకు అర్థమౌతుంది. 9 సం. రాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె తెలుగుజాతికి చేసిన మేలు ఏమీ కనిపించదు కానీ చెడు మాత్రం చేయవద్దని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించటం కోసం ప్రజలను బలి చేయటం పురంధరేశ్వరి వంటి ఔన్నత్యులకు ఎంత మాత్రం సమంజసం కాదని, ఇక ఆమెను తెలుగు ప్రజలు MPగా ఎన్నుకున్నది సోనియా గాంధీని చూసి కాదు, రాజశేఖర రెడ్డిని మరియు ఆమె తండ్రిగారైన రామారావు గారిని చూసి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

   

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలందరూ తమను ఎన్నుకున్న ప్రజల కన్నా కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమనే ఉద్దేశ్యం లోనే ఉన్నట్లైతే ప్రజలు వారిని ఓడించిన రోజు సోనియా గాంధీ వద్ద వారికి ఉండబోయే పలుకుబడి ఏమిటి? అనే విషయాన్ని తమని తాము వారు ఒకసారి విశ్లేషించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.