రూ.3,626 కోట్లతో పూణే మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం
posted on Jun 25, 2025 5:59PM
.webp)
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మరోవైపు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
పూణేలోని మెట్రో లైన్ ఫేజ్-2 కోసం రూ.3,626 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఆగ్రాలోని పొటాటో రీజనల్ సెంటర్ ఏర్పాటుకు రూ.111.5 కోట్లు మంజూరు చేసింది. అదే విధంగా కోల్డ్ ఫీల్డ్ రీహాబిటేషన్ కోసం రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌కు రూ.5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను స్వాగతిస్తూ మరో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.