రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవసరం ఉంది: పీ వీ పీ

ట్వీట్ చేసి మరీ కొత్త సంక్షోభానికి తెర తీసిన వై ఎస్ ఆర్ సి పీ నేత పొట్లూరి

పాలక వై ఎస్ ఆర్ సి పీ కి సంక్షోభాల మీద సంక్షోభాల తాకిడి మొదలైంది. మొన్నటి దాకా మంత్రులు కొడాలి నాని, బొత్స సత్తిబాబు కావాల్సినంత మసాలా  అందిస్తే,ఈ రోజు ట్వీట్ తో   పీ వీ పీ, అదేనం డీ,,, విజయవాడ లోక్ సభ స్థానానికి వై ఎస్ ఆర్ సి పీ అభ్యర్థిగా నుంచుని , కేశినేని నాని చేతి లో ఓటమి పాలైన పొట్లూరి వీర ప్రసాద్ పొద్దున్నేవదిలిన ట్వీట్ బాణం ...సూటిగా జగనన్న గుండెలో దిగింది.. ఆడవారి కి ఆస్తిలో సమన హక్కు కల్పించి, తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి చాటి చెప్పిన అన్న ఎన్ టీ ఆర్ స్ఫూర్తి తో , మన తెలుగు వారు కూడా , మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నారంటూ ట్వీట్ బాంబ్ పేల్చారు. వాస్తవానికి ఇక్కడ పీ వీ పీ ...సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ, బూజు పట్టిన సంప్రదాయాలను తన ట్వీట్ లో ఎండా గట్టారు. మగ ఆఫీసర్లు ఆడవారి ఆర్దర్లను తీసుకోరన్న ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి , సుప్రీమ్ కోర్టు కొత్త శకానికి నాంది పలికిందనే తన ఆనందాన్ని ఆయన తన ట్వీట్ లో పలికించటమే కాకుండా, ఆ సంబరానికి మరింత శోభ తేవటం కోసం, ఏకంగా ఈ  రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కావాలనే తన అభిలాషను చాలా ఉద్వేగం గా వ్యక్తం చేశారు..." అవకాశాల్లో సగం, ఆస్తి లో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వం లో సగం..." అంటూ తన ఆకాంక్షను బలంగా వ్యక్తం చేశారు.

పీ వీ పీ ట్వీట్ ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం నేతలు మాత్రం, ఆయన ఆకాంక్షకు కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించబోతున్నాయనీ, ఒక వేళ సి బీ ఐ కేసుల నేపధ్యం లో జగన్ తప్పుకుంటే, ముహ్యమంత్రి చెయిర్ లో భారతి ని కూర్చోబెట్టవచ్చుననే సంకేతం ఇవ్వటానికే, వై ఎస్ ఆర్ సి పీ నాయకుడు పీ వీ పీ ఈ రకంగా ట్వీట్ చేసి ఉంటాడని టీ డీ పీ  లీడర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు, ఈ రకమైన ఫీలర్లు వదలటం ద్వారా వై ఎస్ ఆర్ సి పీ అధిష్టానం , రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మార్పు గురించి ముందస్తుగా నే ప్రజలను సెన్సిటైజ్ చేసే కార్యక్రమం మొదలెట్టిందనీ, జగన్  మోహన్ రెడ్డి సి.బి.ఐ. కేసుల నేపధ్యం లో సి.ఎం. పదవి ని త్యజించాల్సి  వస్తే,వెంటనే ఆయన భార్య భారతి ని ముఖ్యమంత్రి ని చేయటం కోసమే వై ఎస్ ఆర్ సి పీ ఈ రకమైన వ్యూహాత్మక ప్రచారానికి దిగిందనీ తెలుగు దేశం నాలెడ్జ్ సెంటర్ ప్రముఖులు భావిస్తున్నారు.