మనం నోరు మూసుకుంటే సరిపోదు...

 

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 6వ అమాత్యుల హార్ట్ ఆఫ్ ఆసియా సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టెర్రరిజాన్ని ఓడించడానికి మనం సమైక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే తీవ్రవాదం ఆగిపోతుందని తెలిపారు. తీవ్రవాదంపై మనం నోరు మూసుకుని కూర్చుంటే సరిపోదని.. ఇండియా-అఫ్ఘనిస్థాన్ మధ్య బలోపేతమైన సంబందాలు నెలకొనాల్సి ఉందన్నారు. తీవ్రవాదం, విదేశీ చొరబాట్లు అఫ్ఘన్‌కు భయంకరంగా మారిందని తెలిపారు. సల్మా డ్యాం అక్కడి ప్రజల పురోగతికి ఉపయోగపడిందన్నారు. ఇంకా అఫ్ఘనిస్తాన్ అద్యక్షుడు అశ్రఫ్ ఘనీ మాట్లాడుతూ.. 1.25 బిలియన్ల భారతీయుల అండదండలు తమకున్నాయని పేర్కొన్నారు. తమ చారిత్రక సహకారం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.