విభ‌జ‌న రాజ్యాంగ విరుద్దం

 

రాష్ట్ర విభ‌జ‌న‌కు నిర‌స‌న‌గా సీమాంద్రలో నిర‌స‌న‌లు వెళ్లువెత్తుండ‌గా ఇప్పుడు ఈ విష‌యంపై న్యాయ‌పోరాటానికి కూడా సిద్దమ‌వుతున్నారు స‌మైక్య వాదులు. ఆంద్రప్రదేశ్‌ను విభ‌జించాల‌న్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ న్యాయ‌వాది పీవీ ర‌మ‌ణ సుప్రిమ్ కోర్టులో పిల్ వేశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగంలోని 321-డి అధికరణ ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు.

కేంద్రంలొని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ తీసుకున్న రాష్ట్రవిభ‌జ‌న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేఖ‌మ‌ని ఆయ‌న పిల్‌లో పేర్కొన్నారు. కేవ‌లం టిఆర్ఎస్ పార్టీ కోరిక మేర‌కు రాష్ట్రాన్ని విభ‌జించాల‌నుకోవ‌టం అన్యాయం అన్నారు. కేంద్ర అస‌లు ఏ ఆధారంగా రాష్ట్రాన్ని విభ‌జించాల‌నుకుంటుందొ స్పష్టంగా తెలియ‌జేయ‌లేద‌ని పేర్కొన్నారు.

రాష్ట్రవిభ‌జ‌న నిర్ణయం పూర్తిగా ఏక‌ప‌క్షం అని పేర్కొన్నారు ర‌మ‌ణ‌. ప్రజ‌ల‌ను సంప్రదించ‌కుండా కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌తో కేంద్ర రాష్ట్ర విభ‌జ‌న నిర్ణయం తీసుకుంద‌న్నారు. పివి ర‌మ‌ణ వేసిన పిల్‌ను సుప్రిం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి స‌దాశివం విచార‌ణ‌కు స్వీక‌రించారు.