కుల రాజకీయాలు అంటే మంట...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒక హీరోగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన్ని ఇష్టపడేవాళ్లే ఎక్కువ. ఇక ఇప్పుడు ఏదో ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పిన పవన్ కళ్యాణ్... అప్పుడప్పుడు ప్రజల సమస్యలపై స్పందిస్తూనే ఉన్నాడు. ఇక ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుకు ఆయనకు లండన్ అవార్డ్ కూడా ఇచ్చింది. ఇక యూరప్ టూర్లో వున్న పవర్ స్టార్.. 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్' (TAL) నిర్వహించిన 'యువ సమ్మేళనం'లో పాల్గొని రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కులాల పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. యువ సమ్మేళనం యువతీయువకులతో ముచ్చటించిన పవన్... మీ దృష్టిలో మానవత్వం అంటే ఏంటి అన్న ఒకమ్మాయి ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించారు. కుల, వర్ణ, ప్రాంతాలంటూ ఏ అడ్డుగోడలూ లేకుండా సమభావం పాటించడమే మానవత్వం అన్నారు.

 

ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుతూ..పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వగానే నువ్వు పలానా కులం అంటూ ముద్ర వేస్తారు.. వద్దన్నా మెళ్ళో ఒక బిళ్ళ తగిలిస్తారు.. ఈ తరహా కుల రాజకీయాలకు తాను వ్యతిరేకం అన్నారు. కుల ప్రాతిపదికన ఎవరు మద్దతిచ్చినా తీసుకునేది లేదని స్పష్టం చేశారాయన. ఆ మాటకొస్తే మానవత్వమే నా కులం అంటూ చెప్పుకొచ్చారు. ''నేను ఏ కులంలో పుట్టినా.. నాకు మాత్రం క్రిస్టియన్ పాప పుట్టింది.. కులం అనేది మన ఛాయిస్ కానప్పుడు.. ఆ కులానికి మనమెందుకు ప్రయారిటీ ఇవ్వాలి'' అంటూ సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.