ఇలా బుక్కయ్యావేంటి పవన్...

 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఎవరు చెప్పారో కానీ.. మహానుభావుడు ఆయన చెప్పింది మాత్రం నిజమే. ఎంతో అనుభవం లేకపోతే కానీ ఇలాంటి సూక్తులు బయటకు రావు. ఇప్పుడు రాజకీయాల గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? అక్కడే ఉంది మరి అసలు స్టోరీ. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏపీ ప్రజలను తిట్టినందుకు తాను 11 రోజులు అన్న తినకుండా మానేసానని... చాలా బాధేసిందని చెప్పింది ఎవరో గుర్తొచ్చింది కదా. అదేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంతేకాదు ఓ సభలో పవన్ మాట్లాడుతూ ‘ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా’ అని కూడా అన్నాడు. ఇక దానికి అసలే మాటలపుట్ట అయిన కేసీఆర్ ఊరుకుంటాడా.. ‘ఆడి పేరేందిరా బై’ ఎవడో పవన్ కళ్యాణ్ అంట.. ఆడేవడో నాకు తెలీదు.. అని కేసీఆర్ గారు చాలా పద్దతిగా పవన్ పై కామెంట్లు చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు కేసీఆర్ పవన్ కళ్యాణ్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ వీరిద్దరి భేట హాట్ టాపిక్ గా మారింది.

 

ఇక్కడి వరకూ అంతా బాగనే ఉంది. ఎవరి రాజకీయ అవసరాలు వాళ్లవి. ఈరోజు తిట్టుకోని... రేపు కలుసుకోవలం రాజకీయ నాయకులకు మామూలే. కానీ ఈ భేటీలో పవన్ మాట్లాడిన మాటలే కాస్త విడ్డూరంగా అనిపించాయి అంటున్నారు ఏపీ రాజకీయ విశ్లేషకులు. అంత విడ్డూరంగా పవన్ ఏం మాట్లాడాడబ్బా అనుకుంటున్నారా..? ఏంటంటే.... ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారానికి, తెలంగాణా నాయకుల స్పూర్తిని తీసుకోవాలంట. కెసిఆర్ ఎలా పోరాడాడో ఆంధ్రా వారు ఆదర్శంగా తీసుకోవాలంట. ఈ మాటలే ఇప్పుడు ఆంధ్రా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ని ఆంధ్రపాలకులు ఆదర్శంగా తీసుకోవాలనటం పవన్ అవివేకమే అంటున్నారు. అయినా ఏదో కేసీఆర్ పోరాడినందుకు రాష్ట్రాన్ని ఇవ్వలేదు.... సోనియా తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఈ విషయం... అందరికీ తెలుసూ.. పవన్ ఇలా మాట్లాడటం చాలా కామెడిగా ఉంది అని అంటున్నారు. బహుశా ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తి గురించి సరైన అవగాహన పవన్ కు లేక మాట్లాడినట్టు ఉన్నారు.. తెలంగాణ కన్నా యాభై ఏళ్ళ ముందే అప్పటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న విజయం ఆంధ్రులది..మరి ఎన్నో పుస్తకాలు చదువుతా అని చెబుతారు..ఆంధ్రుల గురించి పవన్ ఎక్కడా చదవలేదా అని కూడా కామెంట్లు విసురుతున్నారు. మొత్తానికి  కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కు కూడా ఇప్పుడిప్పుడే రాజకీయనీళ్లు వంటపడుతున్నట్టు ఉన్నాయి. అందుకే ఎక్కడ పాడాల్సిన పాట అక్కడ పాడటం నేర్చుకుంటున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అనుకోండి. పాపం పవన్ కు కొంచం కొత్త కదా... అందుకే ఇలా మాట్లాడి దొరికిపోయాడు. మాట్లాడితే మాట్లాడాడు... ఏపీ ప్రజలకు కోపం వచ్చేలా మాట్లాడి బుక్కయ్యాడు.. మరి దీన్ని ఎలా కవర్ చేసుకుంటాడో చూద్దాం...