దుమ్ముదులిపిన గల్లా.. షాక్ లో మోడీ.. పూల్స్‌లా కనిపిస్తున్నామా..?

 

గుంటూరు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మిరపకాయలకు ఎంత ఘాటు ఉంటాయో.. అంతే ఘాటుగా స్పందించారు మన ఎంపీ లోక్ సభలో ఇంతకీ ఆ ఎంపీ ఎవరునుకుంటున్నారా...? ఇంకెవరు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. చూడటానికి ఎంతో సౌమ్యుడిగా... సైలెంట్ గా ఉండే గల్లా.. నిన్న లోక్ సభలో కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడిన విధానం చూసి అందరూ ఖంగుతిన్నారు. ప్రధాని మోడీ దగ్గర నుండి మిగిలిన ఎంపీలందరూ గల్లా నిలదీసిన విధానం చూసి షాకయ్యారు. అసలు గల్లాయేనా ఇలా మాట్లాడింది అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు తెలుగు ప్రజల మనసులో ఏముందో గల్లా అదే తమ మాటాల్లో చెప్పారని... తెలుగువాడు ఏలాంటి ఆవేదనతో ఉన్నాడో.. తన మాటల ద్వారా అడిగారని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

తమ మాటలతో 'మోడీ' ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు...! అసలు మీరేమనుకుంటున్నారూ...ఆంధ్రా ప్రజలు..పూల్స్‌లా కనిపిస్తున్నారా..? ఎన్నాళ్లు ఇలా మోసం చేస్తారు..? అని మండిపడ్డారు. కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ..టీడీపీ కానీ మోసపోయే జాబితాలో ఉండరు.మా ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు...? మేము మిత్రధర్మం పాటిస్తుంటే..మీరు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు... విభజిత ఆంధ్రాకు ఇచ్చిన హామీల్లో ఏవి అమలు అయ్యాయో..చెప్పండి..అంటూ నిలదీసి అడిగారు. కర్ణాటక మెట్రో కి 17 వేలు కోట్లు ఇచ్చారు..అలాగే ముంబై కి 51 వేల కోట్లు ఇచ్చారు..మరి ఏపీ ఏం పాపం చేసిందని.. అంటే కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి అని నిధుల వర్షం కురిపించారా..? ఏపీలో ఎన్నికలు వస్తేగానీ ఇవ్వరా అంటూ ఫైర్ అయ్యారు.

 

గడిచిన నాలుగేళ్లలో మా ముఖ్యమంత్రి 29సార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని - ఆర్థిక మంత్రిని - ఇతర కేబినెట్ మంత్రులను కలిశారు. సవిరమైన నివేదికలు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కూడా ప్రధానిని కలిసి సమగ్ర నివేదిక అందజేశారు. ఇంత చేసినా ఇంకా సమాచారం కావాలని కోరడం.. పరిశీలిస్తున్నామనడం సిగ్గుచేటు.. అమరావతిని ఆదుకోవాలి.. అది మీరు ఇచ్చిన హామీ కాదు యాక్ట్ ప్రకారం చేయాలి.. గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం 40 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పాం.. కానీ ఇప్పటికి మీరు ఇచ్చింది కేవలం రెండు వేల కోట్లు ఇలా అయితే మా రాజధాని నిర్మాణం ఎప్పటికి జరుగుతుందని ప్రశ్నించారు. మాకు మీరు బడ్జెట్ లో ఇచ్చిన మొత్తం బాహుబలి సినిమా కలెక్షన్లు అంత కూడా లేవు అంటూ ఘాటుగా సెటైర్లు విసిరారు. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు... రాష్ట్రాన్ని విభజించి రాజకీయ లబ్ది పొందాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు ఎలాంటి గతి పట్టించారో తెలుసుకదా... అలాంటి పరిస్థితి బీజేపీకి రాకుండా చూసుకోవాలని అన్నారు.  కాంగ్రెస్ మాకు సున్నా ఇచ్చింది మీరు మాకు ఇప్పటికి ఏమి ఇచ్చారు.. ఎందుకు మీతో కలిసి ఉన్నామా అని అనిపిస్తోంది...మిత్ర ధర్మాన్ని పాటించకపొతే మాత్రం మీకు కాంగ్రెస్ గతే పడుతుంది.. ఇదే చివరి అవకాశం. ఇప్పుడైనా ఆలోచించుకోండి.. అని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఇన్నిరోజులు ఏదో సహనంగా ఉన్న మన కోపాన్ని గల్లా తన స్వరం ద్వారా మోడీకి వినిపించారు. మరి ఇప్పటికైనా మోడీ ఆలోచించుకుంటారా..? లేక లైట్ తీసుకుంటారా..?చూద్దాం ఏం జరుగుతుందో...