ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్, గాదె విజయం

 

 

MLC election results today, MLC election results news, MLC elections, MLC election latest news

 

 

శాసనమండలిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి సింహాద్రి అప్పన్నపై ఆయన 900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

 

టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ బరిలోకి దిగిన స్వామిగౌడ్ విజయం సాధించారు. స్వామిగౌడ్  తొలి రౌండ్‌లోనే డెబ్బయి శాతం ఓట్లు సాధించారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కూడా ఆయన ఆధిక్యతలో ఉన్నారు. మూడో రౌండ్‌లో స్వామిగౌడ్ విజయం సాధించారు.

 

14 జిల్లాల్లోని ఆరు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆయా జిల్లాల్లో కొనసాగుతోంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపును కరీంనగర్ అంబేడ్కర్ భవనంలో చేపట్టారు.


ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో జరుగుతోంది. ఉభయ గోదావరి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.