కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

 

తెలంగాణ మంత్రి హరీశ్ రావు మెదక్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 250 ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేశామని.. బీసీలకు కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపజేస్తున్నామని వివరించారు. రైతులు పత్తిపంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని అన్నారు.

 

 

మరోవైపు విద్యార్దులకు నాణ్యమైన విద్యను అందించడమే కేసీఆర్ లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ హ్యాట్రిక్ 2016ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందు ఈ ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.