మాంచెస్టర్‌ ఉగ్రదాడి... కారణం ఇతనే..!

 

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.  అమెరికా పాప్‌స్టార్‌ అరియానా గ్రాండే సంగీత కచేరీలో ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడి జరిపి విధ్వంసం చేసిన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి పాల్పడింది 22ఏళ్ల సల్మాన్‌ అబేదీ అని తెలిసింది. ఇంతకీ అబేదీ ఎవరంటే... అబేదీ కుటుంబం లిబియా దేశానికి చెందిన వారు. కొన్నేళ్ల క్రితం మాంచెస్టర్‌లోని  ఫాలోఫీల్డ్‌ ప్రాంతంలో ఉన్న వారు ఆ తరువాత లిబియా వెళ్లిపోయారు. అయితే అబేదీ మాత్రం తిరిగి చదువుకోవటానికి మాంచెస్టర్‌కు తిరిగి వచ్చేశాడు. 2014లో మాంచెస్టర్‌కు వచ్చిన అబేదీ.. సాల్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చేరాడు. రెండేళ్ల పాటు అతడి విద్యాభ్యాసం సాఫీగానే సాగిన..2016 మధ్యలోనే తన చదువును ఆపేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ తరువాత అబేదీ త్రీవవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. మాంచెస్టర్‌ దాడిలో ఉపయోగించిన శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని అబేదీ తన ఇంట్లోనే తయారు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.