పురపాలక చట్టంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్ లో తాజాగా కొత్త కలెక్టర్లకు అవగాహన కార్యక్రమంలో జరిగింది. నగరంలోని మర్రి చెన్నా రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లో అదనపు కలెక్టర్ లకు నూతన పురపాలక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనిచెయ్యని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రూపాయి లంచం లేకుండా 21 రోజులలో ఇళ్లకు పర్మిషన్ లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచించి పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఏప్రిల్ నుంచి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురానుండటం తో మార్చి లోపు దానికి సంబంధించిన అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బి-పాసా తో పాటు మరో రెండు కొత్త యాప్ లను తీసుకువస్తున్నామన్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అన్నారు. మెరుగైన పరిపాలన కోసమే కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చినట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్. ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను తెలుసుకొని పని చేయాలని కలెక్టర్ లకు సూచించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన ప్రగతిని సాధించవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.