చాకలి ఐలమ్మకు సీఎం రేవంత్ నివాళి!

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీకగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రేవంత్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.  గడీలపై గళమెత్తి భూపోరాటానికి నాంది పలికి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించి.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన జరిగిందని పేర్కొన్నారు. ఉద్యమ పోరాటంలో మహిళల పాత్ర అసమానమైనది అని ఐలమ్మ చాటి చెప్పారన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu