కొత్త పార్టీ ఆలోచనలో కిరణ్ ?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల వల్ల రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. లోకవిరుద్ధంగా వెళ్తే ప్రజలు ఇంటికి పంపిస్తారని, సరైన సమనయం వచ్చినప్పుడు ముందుకు వస్తామని కిరణ్ చెప్పడంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో రకరకాల ఊహాగానాలకు రేకెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడారు, ఏం చేయబోతున్నారు అనే ప్రశ్న అందరికి కలుగుతుంది.

 

గురువారం రవీంద్ర భారతిలో జరిగిన 'తెలుగు భాషా దినోత్సవం'లో సందర్భంగా ప్రసంగించిన కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రసంగం చివరలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనపై సరైన నిర్ణయాలు తీసుకోకుంటే ప్రజలు సెలవు ప్రకటిస్తారని.... సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా ముందుకు వస్తామని, తెలుగు ప్రజల పురోగతికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటామని, ఎంత కష్టమైన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఇవ్వాలని తెలుగు తల్లిని వేడుకుంటున్నామని ఆయన అన్నారు.

ఈ విధంగా విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, సొంత పార్టీ పెడతారని రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.