మొత్తానికి పవన్ కూడా ఓ ఛానల్ వాడయ్యాడు..!!

 

రాజకీయాల్లో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుంది.. అందుకే ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు సొంతంగానో, లేక సానుకూలమైన వ్యక్తుల చేతనో ఓ టీవీ ఛానల్, పత్రిక నడిపిస్తుంటాయి.. వీటి ద్వారా వార్తలతో పాటు ప్రజలకి పార్టీ గురించి పాజిటివ్ గా చెప్తుంటారు.. ఇది అందరికి తెలిసిన నిజం.. ఇక ఏపీ విషయానికొస్తే.. టీడీపీకి సొంతంగా ఛానల్ లేనప్పటికీ చంద్రబాబుకి అనుకూలంగా కొన్ని ఛానెల్స్ ఉన్నాయని అంటుంటారు.. ఇక వైసీపీ జగన్ కి సొంత ఛానల్, పత్రిక ఉన్న సంగతి తెలిసిందే.. మరి జనసేన పరిస్థితి ఏంటి.. సొంత ఛానల్ లేదు.. దానికి తోడు కొన్ని ఛానెల్స్ వ్యతిరేకమయ్యాయి.. దీంతో జనసేన సోషల్ మీడియానే నమ్ముకోవాల్సి వచ్చింది..

అయితే ఇప్పుడు జనసేనకు అనుకూలంగా ఒక ఛానల్ వచ్చినట్టు తెలుస్తోంది.. అదే 99 టీవీ.. తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ ఛానల్ ను టేకప్ చేసుకొని ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే కొబ్బరికాయ కొట్టించినట్టు తెలుస్తోంది.. తోట చంద్రశేఖర్ గతంలో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు.. తరువాత వైసీపీ లో చేరారు.. అక్కడ కూడా గెలుపు వరించలేదు.. ఈసారి జనసేన తరుపున ఎంపీగా పోటీ చేయాలని చూస్తోన్నట్టు తెలుస్తోంది.. అందుకే ఇప్పుడు జనసేన కోసం ఓ ఛానల్ కూడా తీసుకున్నారట.. చూద్దాం మరి జనసేన ఈ ఛానల్ అండతో ఎలా ముందుకెళ్తుందో.