జగన్ ను సీఎం చేసిన అర్నబ్...

 

ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తూ బిజీబిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అయితే ఆ విషయం ఆ పార్టీ నేతలకు.. ఆయన ఛానల్ కు తప్పా ఇంకెవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టి సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. ఇక ఆయన కలల్లో ఆయన ఉండగా.. ఆ కలల్లో పీకే తన సర్వేల ద్వారా అప్పుడప్పుడు నీళ్లు పోస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అనుకున్న రీతిలో సీట్లు రావని... ముఖ్యంగా తాము కంచుకోటగా భావించిన రాయలసీమలో కూడా జగన్ కు షాక్ తగలక తప్పదు అని ఆయన సర్వేల్లో తేలిన విషయాలే. దీనికి ఏం చేయాలా అని జగన్ అండ్ కో బ్యాచ్ తిప్పలు పడుతుంటే... ఇప్పుడు మరో సర్వే జగన్ కు షాక్ ఇచ్చింది.

 

అయితే ఈసారి మంచి షాకే తగిలింది. కానీ సర్వే చేసింది పీకే కాదు. ఏకంగా ఓ జాతీయ ఛానలే ఏకంగా సర్వే చేసింది. రిపబ్లిక్ ఛానల్ సర్వే చేసింది. రిపబ్లిక్ ఛానల్ అధినేత పాపం జగన్ బాధ చూసి తట్టుకోలేక, జగన్ ను కనీసం తన ఛానల్ లో అయినా సియం చెయ్యాలి అని అనుకున్నారేమో..  నిన్న ఒక సర్వే అంటూ హడావిడి చేశాడు. ఇక ఈ సర్వేలో కొన్ని భయంకరమైన విషయాలే చెప్పారు అర్నబ్ గారు. మనరాష్ట్రంలో కనుక ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే... 25 ఎంపీ సీట్లలో, జగన్ పార్టీకి 13 సీట్లు వస్తాయి అని చెప్పాడు. అంతేకాదు... అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ మార్కు దాటుతుందని అర్నబ్ గారు చెప్పారు.

 

ఇది నిజంగా జగన్ కు షాక్ తగలడం ఏమో కానీ.. మిగిలిన వారికి మాత్రం పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే ఇక్కడ జగన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.  అసలు జగన్ అనే వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాడని జనం మర్చిపోయి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లమెంట్ తప్ప, ఎక్కడా కన్ఫర్మ్ సీట్ లేదు... అటు తిప్పి, ఇటు తిప్పి చూసినా, మహా అయితే 3 నుంచి 5 సీట్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్న వారి అంచనా... అలాంటిది ఏ ప్రాతిపదికన 13 వస్తాయి అంటున్నాడో అర్నబ్ కే తెలియాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం బయటకొచ్చింది. రిపబ్లిక్ టీవీని మోడీ సపోర్ట్ ఛానల్ గా అంటుంటారు. అన్ని రాష్ట్రాల్లో NDAకి అనుకూలంగా సర్వే చెప్పిన అర్నబ్, మన రాష్ట్రంలో మాత్రం జగన్ కు అనుకూలంగా చెప్పాడు... దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక బీజేపీ పెద్దల ఆలోచన ఎమన్నా ఉందా ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. దానికి తోడు అసలు ఇదొక సర్వే.. దీనికి జగన్ హ్యాపీగా పీలవడం చాలా కామెడీగా ఉందని అన్నారు.