నిర్మలా సీతారామన్ ప్రకటన.. నిమిషాల్లో లాభాల పంట!!

 

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశీయ తయారీ రంగానికి కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్టు కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును 30శాతం నుంచి 25.17శాతానికి తగ్గించారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా, ఆర్థికమంత్రి ప్రకటనతో స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 1,669 పాయింట్లు ఎగబాకి 37,764 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 480 పాయంట్ల లాభంతో 11,181కి పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఉన్న 30 కంపెనీలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి 10 శాతం పైగా లాభాల్లో దూసుకోపోతోంది.