కేంద్రపాలిత ప్రాంతంగా హైద‌రాబాద్‌

 

సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌పై ఎట్టకేల‌కు కేంద్రమంత్రి చిరంజీవి నోరు విప్పారు. ఈ రోజు సోనియా గాందీని క‌లిసిన చిరంజీవి త‌రువాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు ఆయ‌న‌ తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రక‌టిస్తే సీమాంధ్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌ను అదుపు చేయ‌చ్చచి ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో సీమాంద్రుల భ‌యాన్ని దూరం చేయ‌టంతో పాటు ఇరు ప‌క్షాల వారికి స‌మ న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.

సోనియాతో ఇదే విష‌యాన్ని చెప్పాన‌న్న చిరు ఆమె ఇరు ప‌క్షాల‌కు న్యాయం చేస్తానన్నారు అని చెప్పారు. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకుంటుంద‌ని తాను అనుకోవ‌టం లేద‌న్నారు చిరు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చే వరకూ విభజన ప్రక్రియ ముందుగా వెళ్లదని ఆయన తెలిపారు.