ఉత్తరాఖండ్‌ సీఎం కు అస్వస్థత...

Publish Date:Jan 10, 2017


ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు, మెడ నొప్పి రావడంతో ఆయన్ని డూన్‌ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. మెడనొప్పితో అసౌకర్యంగా అనిపించడం వల్లే ఆస్పత్రికి వెళ్లినట్లు స్పష్టంచేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం తనని పర్యవేక్షిస్తోందని తెలిపారు. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి వచ్చే నెల 15న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోసారి అధికార పీఠాన్ని సాధించేందుకు కాంగ్రెస్‌ కస్తరత్తు చేస్తోంది.

By
en-us Politics News -