ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వాల్సిందే..

 

ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోన్ ను కేంద్రం ఇవ్వాల్సిందే అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తేల్చి చెప్పారు. ఈరోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో... గవర్నర్ గారు ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని... విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని..ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని గుర్తు చేసిన ఆయన, తన ప్రభుత్వం మూడున్నరేళ్లుగా హామీల అమలు కోసం ప్రయత్నం సాగిస్తోందని అన్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లో సూచించిన విధంగా ఆస్తుల పంపిణీ చేపట్టాలని కోరారు. కేంద్ర నిధులతో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వుందని అన్నారు. అంతేకాదురాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, అవమాన భారంతో ఆగ్రహంగా ఉన్నారని, కష్టాలు తీర్చి, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని నరసింహన్ అభిప్రాయపడ్డారు.