అరుణ్ జైట్లీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
Published on: Tue Sep 2, 2014 11:36AM
.jpg)
కేంద్ర మంత్రులను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మొన్నీమధ్య కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు. ఇప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. వెన్నునొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారని, ఆయన వెన్నుకు చిన్న ఆపరేషన్ చేయనున్నారని సమాచారం. బడ్జెట్ సమర్పించే సమయంలో కూడా అరుణ్ జైట్లీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా కుర్చీలో కూర్చుని ఆయన కేంద్ర సాధారణ బడ్జెట్ను సమర్పించారు.


