తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదల

 

తెలంగాణ రాష్ట్రం నిర్వహించే ఎంసెట్ షెడ్యూలు విడుదలైంది. ఈనెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 9 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు పరిశీలిస్తారు. మే 8 నుంచి 12వ తేదీ వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం వుంది. మే 14న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. మే 28వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎంసెట్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలసి ఎంసెట్ నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తూ సొంతగా ఎంసెట్ నిర్వహిస్తోంది.