ఈ ఫొటో ట్రంప్ మనసునే మార్చేసింది...

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటే సెపరేట్ అని చెప్పొచ్చు. తనకు నచ్చినట్టు చేయడంలో.... సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో.. ముక్కుసూటిగా మాట్లాడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ అలాంటి ట్రంప్ ను ఓ ఫొటో మార్చింది. తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.. ట్రంప్ అంతలా ఎందుకు మనసు మార్చుకునేలా ఆ ఫొటోలో ఏం ఉంది అనే కదా డౌట్..? అసలు సంగతేంటంటే..  అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మస్టర్‌ ట్రంప్‌కు ఓ ఫొటో చూపించాడట. ఆ ఫొటోలో కొందరు ఆడవాళ్లు తమకు నచ్చిన దుస్తులు ధరించిన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఈ ఫొటో చూపించిన మెక్ మస్టర్... 1930-1970ల మధ్య అప్ఘనిస్తాన్‌లో మహిళలు స్వేచ్చగా సంచరించేవారని అందుకు ఈ చిత్రమే ఉదాహరణ అని మెక్‌మస్టర్‌ అధ్యక్షుడు ట్రంప్‌తో చెప్పారట. ఆ తరువాత తాలిబన్లు అప్ఘనిస్తాన్‌ను తమ చేతిలోకి తీసుకుని, మహిళల దుస్తులపై ఆంక్షలు విధించారని వివరించారని తెలిపారు. అంతేకాదు అప్ఘనిస్తాన్‌లో తిరిగి శాంతి సామరస్యాలు నెలకొల్పాలంటే ఆ దేశం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించొద్దని కోరారట. ఇక మెక్ మస్టర్ చెప్పిన మాటలువిని.. ఫొటోను నిశితంగా పరిశీలించిన ట్రంప్.. మనసు మార్చుకొని  అప్ఘనిస్తాన్‌లో యుద్ధాన్ని ఆపొద్దని..దళాలను ఉపసంహరించుకోవడం లేదని..అవసరమైతే మరిన్ని దళాలను పంపడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. మొత్తానికి  ఎంతో కఠినంగా ఉంటే ట్రంప్... తనకు కూడా మనసు ఉందని నిరూపించుకున్నారు.