TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

డీలిమిటేషన్ ను వ్యతిరేకించే ధైర్యం వైసీపీకి ఉందా: షరతులంటున్నా బేషరతు మద్దతేనా.?

Published on: Sat Nov 28, 2026 9:10AM

 పార్లమెంటులో ప్రతిపాదిత  డీలిమిటేషన్  బిల్లుపై  వైసీపీ వైఖరి జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది.  కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఈ బిల్లును వ్యతిరేకిస్తామని తొలుత ప్రకటించిన వైసీపీ ఇప్పుడు షరతుతో కూడిన మద్దతు అంటోంది.   లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీ ఇండియా కూటమికి దగ్గరౌతోందని వస్తున్న విశ్లేషణలన్నీ వైసీపీ అధినేత నిర్ణయంతో వీగిపోయినట్లేనని భావించాల్సి ఉంటుంది.  

అదే సమయంలో, కేవలం రాష్ట్ర స్థాయి సీట్ల సంఖ్య పెరిగితే సరిపోదని, రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య సీట్ల నిష్పత్తిలో అసమానతలు తలెత్తకుండా చూడాలనే అంశంపై కూడా వైసీపీ పట్టుబడుతోందన్నట్లుగా వస్తున్న వార్తలను పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు. 

వైసీపీ పేరుకు మాత్రమే షరతు అంటున్నదనీ, వాస్తవానికి డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీ బేషరతు మద్దతే పలుకుతోందని చెబుతున్నారు.  రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య సమతుల్యత అన్న ఆ పార్టీ వ్యాఖ్యలు, డిమాండ్లు అన్నవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రకటనలేనని విశ్లేషిస్తున్నారు. 

ఇందుకు ఉదాహరణగా గతంలో జరిగిన పరిణామాలను వారు ఉదహరిస్తున్నారు. మొత్తంగా  పైపైకి ఎన్ని విమర్శలు గుప్పించినా, కేంద్రంలోని మోడీ సర్కార్ కు మద్దతు అన్నది వైసీపీ విధానంగా గత పుష్కరకాలంగా నిలుస్తూ వస్తున్నదని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే విధానానికి వైసీపీ కట్టుబడి ఉంటుందని అంటున్నారు. 

 ఇది కూడా చదవండి:  ఎన్డీయేకు జగన్ మద్దతు: షరతు నిజంగానే వర్తిస్తుందా?

మరోవైపు,  కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో గానీ, ప్రతిపక్ష కూటములతో గానీ రాజకీయ పొత్తుల లెక్కలతో సంబంధం లేకుండా, మోడీ, షా ద్వయానికి మద్దతు అన్న విధానాన్ని వైసీపీ 2014 నుంచీ అవలంబిస్తూ వస్తున్న విషయాన్ని రాజకీయ పరిశీలకులు ఆ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

మొత్తంగా చూస్తే, డీలిమిటేషన్ బిల్లు విషయంలో వైసీపీ షరతులతో కూడిన మద్దతు అంటూ చెబుతున్న మాటలు పైపైకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. మద్దతు ఇవ్వడం వినా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మీకు నచ్చవచ్చు:  అప్పుడు బొద్దింకలకు జై: ఇప్పుడు మోడీకి జైజై.. కన్ఫ్యూజన్ లో జగన్.!

హైకోర్టులో జగన్ కు ఊరట: కేసు విచారణపై స్టే.!

[Delimitation Bill, YCP UPPORT, Lok Sabha seats, Conditions, YCPstance, TeluguOne]