TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైకోర్టులో జగన్ కు ఊరట: కేసు విచారణపై స్టే.!

Published on: Wed Nov 11, 2026 11:44AM

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఇంత కీ కేసేమిటంటే.. ఇటీవల పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన  ధర్నాకు సంబంధించి పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

పులివెందులలో మున్సిపల్ పోలింగ్ రోజున పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించడం లేదంటూ ఆరోపిస్తూ వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు పులివెందుల   పోలీసులు జగన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు ఇరువర్గాల వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: జగన్ కు షాక్: అక్రమాస్తుల కేసులో రోజు వారీ విచారణ, వ్యక్తిగత హాజరు: సీబీఐ కోర్టు నిర్ణయం.!

దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, అనుమతి లేకుండా ధర్నా చేపట్టడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలు సేకరించామని ప్రభుత్వ తరఫు పీపీ వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు, ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఫిర్యాదు చేసిన ఎంఈవో రఫిక్‌కు నోటీసులు జారీ చేసి, కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కాగా ఏపీ మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పులివెందులలో కూడా వైసీపీకి విజయాలు పెద్దగా దక్కలేదు. పులివెందుల మునిసిపాలిటీ, జడ్పీటీసీలు తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. జగన్ కంచుకోటలో తెలుగుదేశం జెండా ఎగరవేసింది, ఈ సమమంలో హై కోర్టులో జగన్ కు ఊరట లభించింది. 

మీకు నచ్చవచ్చు: జగన్ పిటిషన్ మళ్లీ డిస్మిస్.. ఈసారి హైకోర్టు డివిజన్ బెంచ్.!

జగన్ కంచుకోటలో కూటమి జెండా.. కడపలో వైసీపీకి భారీ షాక్.!

[Relief to Jagan in Highcourt, AP High Court Stay, Pulivendula Protest Case, Interim Orders, TeluguOne]