మన సైన్స్‌లో నాణ్యత లేదు

 

ఇటీవల భారత రత్న అందుకున్న సైంటిస్ట్‌ సిఎస్‌ఆర్‌ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలన్నింటికి ముందు తిరుపతి బాలజీ ఆశీస్సులు తీసుకునే ఇస్రో సాంప్రదాయాన్ని ఆయన తప్పు పట్టారు. తనకు అలాంటి వాటి మీద నమ్మకం లేదన్న ఆయన జాతకాలను కూడా నమ్మనని స్పష్టం చేశారు.

శనివారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన ఇలా స్పందించారు. ప్రతిభావంతులైన వారందరూ కంపూటర్స్‌ , సాఫ్ట్‌ వేర్‌ రంగాల వైపు ఎక్కవగా వెలుతుండటం వల్లే మన దేశంలొ సైన్స్‌ నాణ్యత నాసిరకంగా తయారైందన్నారు. ఇప్పటికైనా రిలయన్స్‌, టాటా లాంటి వారు పరిశోదనా రంగం వైపు నిధులు కేటాయించాలని కోరారు.