మానవ వ్యర్ధాల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం


నిర్ధారించిన హ్యాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధన బృందం

మానవ వ్యర్ధాల పరీక్షలు కూడా అనివార్యం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు

ఈ లెక్కన మూసీ నుంచి వ్యర్ధ పదార్ధాలను మనం మున్నేరు ద్వారా , ఆంధ్రా కు తరలిస్తున్నట్టే లెక్క

జహీరాబాద్ అల్లానా ఫ్యాక్టరీ నుంచి వెలువడే జంతు వ్యర్ధాలతో కలుషితమైన మంజీరా నీటినే హైదరాబాద్ వాసులు తాగుతున్నారు


ఇది వినటానికి ఆశ్చర్యం గాఉన్నా, వాస్తవం. మానవ వ్యర్ధాలను పరీక్షిస్తే అందులో కరోనా వైరస్ లక్షణాలను కనుగొన్నట్టు చైనా శాస్త్రవేత్తల పరిశోధన లో తేలింది. స్టూల్ టెస్ట్ ను కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఒక ప్రత్యామ్నాయ పరీక్ష గా చేయాలనీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నిజానికి కోవిడ్ -19 నిర్ధారణ కోసం చేసిన దాదాపు 14 శ్వాసకోశ పరీక్షల్లో - రిసల్ట్ నెగటివ్ వచ్చినప్పటికీ, ఆయా వ్యక్తులకు స్టూల్ టెస్ట్ (మానవ వ్యర్ధాల పరీక్ష) చేసినప్పుడు, కరోనా వైరస్ లక్షణాలు ప్రముఖం గా కనిపించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఆ రోగుల మూత్ర పరీక్షల్లో మాత్రం వైరస్ లక్షణాలు కనపడలేదు. నలుగురు పేషేంట్ల రక్తం లో మాత్రం వైరస్ డిటెక్ట్ అయినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

 

కరోనా వైరస్ సోకినా అనుమానితులు- ఈ మానవ వ్యర్ధాల పరీక్షను, సలైవా, రక్త పరీక్షలతో పాటు విధిగా చేయించుకోవాలని చైనీస్ యునివర్సిటీ ఆఫ్ హ్యాంగ్ కాంగ్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

హాంగ్ కాంగ్ లో ఇటీవల ఆ యునివర్సిటీ లోని మెడిసిన్ ఫ్యాకల్టీ శాస్త్రవేత్తలు -14 మంది కరోనా బాధితులు, అనుమానితుల కు జరిపిన పరీక్షలలో ఈ నిజాలు బయటపడ్డాయని యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ చాన్ కె షుంగ్ వివరించారు. అయితే, స్ఫూటం టెస్ట్ చేయించుకున్న వారు, డీప్ త్రోట్ సలైవా టెస్ట్ కూడా తప్పని సరిగా చేయించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే, ప్రతి మిల్లీ మీటర్ స్ఫూటం కు 3.2 మిలియన్ వైరల్ లోడ్ ఉందనీ, అదే మానవ వ్యర్ధాలకైతే 12,000 వైరల్ లోడ్, డీప్ త్రోట్ సలైవా కు అయితే 10,000 వైరల్ లోడ్ ఉందనీ వెల్లడైంది. సో, భారతీయులారా ... ఈ తరహా టెస్ట్ లకు కూడా మీరు సిద్ధం కండి..... కరోనాకు దూరం కండి.

 

 

ఇక్కడ మరో విషయం ఉంది. జహీరా బాద్ దగ్గర ఉన్న అల్లానా ఫ్యాక్టరీ ద్వారా విడుదలయ్యే జంతు వ్యర్ధాలు, మాంస ఖండాలు, రక్తం అన్నీ కూడా మంజీరా నదిలో కలిసి హైదరాబాద్ చేరుకుంటున్నాయి, అదే మంజీరా నీటిని జంట నగరాల వాసులు తాగుతున్నారు. ఇప్పుడు చెప్పండి.... మనం తాగుతున్న నీరు ఎంత సేఫ్ ?