ఈ డ్రగ్ తీసుకుంటే, రెండు రోజుల్లో కరోనా పరార్!

* హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా లను కూడా ఛాలెంజ్ చేసి నిలిచిన ఇవెర్ మెక్టిన్  

ఇదొక లేటెస్ట్ ఆవిష్కరణ. మానవ దేహంలోని పరాన్నజీవులను తరిమికొట్టే ఇవెర్ మెక్టిన్ అనే,  యాంటీ పారసైటిక్ ఔషధం -ప్రయోగశాలలో సృష్టించిన కరోనా వైరస్ కణజాలంపై ఇవెర్ మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేసిందని, వైరస్ అభివృద్ధిని సమర్థంగా నిరోధించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. కేవలం 48 గంటల్లో కరోనా వైరస్ ను రూపుమాపిందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న కైలీ వాగ్ స్టాఫ్ తెలిపారు. ఇవెర్ మెక్టిన్ ప్రమాదకర హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా తదితర వైరస్ లపై ప్రభావశీలంగా పనిచేస్తుందని గతంలోనే గుర్తించారు. తాజాగా కరోనాను కూడా ఇది దీటుగా తిప్పికొడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. 

ఇవెర్ మెక్టిన్ ఎంతో సురక్షితమైన ఔషధం అని, మనుషుల్లో కూడా సరైన మోతాదులో ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని వాగ్ స్టాఫ్ తెలిపారు. అయితే, కరోనాను ఇవెర్ మెక్టిన్ ఎలా రూపుమాపుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె వెల్లడించారు. కొన్నిరకాల వైరస్ లు ఆతిథ్య కణాలను మందగింపచేస్తాయని, ఆ సామర్ధ్యంపైనే ఇవెర్ మెక్టిన్ బలంగా దెబ్బతీస్తుందని, కరోనా వైరస్ విషయంలోనూ ఇవెర్ మెక్టిన్ అలాంటి పనితీరునే ప్రదర్శిస్తుందని భావిస్తున్నామని వివరించారు.