మాకు ఓటెయ్యకుంటే అంతే..!

 

ఓట్లు కావాలంటే సాధారణంగా రాజకీయ నేతలు ఎలా అడుగుతారు...? మీకు అది చేస్తామనో... ఇది చేస్తామనో... హామీలు ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ లీడర్ మాత్రం బెదిరించినంత పని చేశారు. ఆయన ఎవరో కాదు... మధుగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కే.ఎన్‌.రాజణ్ణ. మధుగిరి పట్టణంలోని మండ్ర కాలనీలో నిర్వహించిన పార్టీ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మధుగిరిని అభివృద్ధి చేసింది తామేనన్నారు. అటువంటి తమకు కాకుండా ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే మీకు చెడు కాలం దాపురించినట్లేనంటూ సరదాగా బెదిరింపులకే దిగారు. ఇంకేముంది ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.