ఏపీలో కాంగ్రెస్ పొత్తు ఎవరితో?

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగింది.. కానీ విడిపోయాక పరిస్థితి మారిపోయింది.. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా బలంగా ఉన్నా, ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.. ఏపీలో 2014 ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవని కాంగ్రెస్, ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకునే ఆస్కారం ఉంది అనుకున్నారంతా.. కానీ కాంగ్రెస్ నేతలు పొత్తు గురించి కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ మాట్లాడుతూ 'ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో మాకు పొత్తు ఉండదు.. ప్రజలతోనే మా పార్టీ పొత్తు' అని స్పష్టం చేసారు.. అలానే కాంగ్రెస్ కి ఏపీలో పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.. చూద్దాం మరి ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం ఎప్పుడొస్తుందో.