స్టేట్ ఆఫ్ ద ఇయర్... మన తెలుగు రాష్ట్రమేనట!

 

ఈ సంవత్సరానికిగానూ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకున్న రాష్ట్రం ఏదో తెలుసా? మరేదో అయితే మనమెందుకు మాట్లాడుకుంటాం? మన ఆంధ్ర రాష్ట్రమే ఆ ఘనతను సాధించింది. స్టేట్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ప్రతీ యేటా సీఎన్ బీసీ టీవీ 18 ఛానల్ అందిస్తుంది. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ కూడా అందిస్తారు. అయితే, 2017కి గానూ నూతన రాష్ట్రం ఏపీ అవార్డ్ స్వంతం చేసుకుంది!

 

ఇంకా శాశ్వత రాజధాని కూడా లేని మన రాష్ట్రం అమరావతి కేంద్రంగా అద్బుత అభివృద్ధి సాధిస్తోందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. హెచ్ డీఎఫ్ సీ సీఎండీ, ఎస్బీఐ సీఎండీ లాంటి ప్రుముఖులు జడ్జ్ లు గా వ్యవహరించిన పోటీలో ఆంద్రా మిగతా రాష్ట్రాల్ని వెనక్కి నెట్టి పురస్కారం సాధించింది. దీనికి కారణం అభివృద్ధి రేటే. పోయిన యేడు చంద్రబాబు సారథ్యంలోని నవ్యాంధ్ర 10.99శాతం అభివృద్ధి సాధించగా... ఈ యేడు అప్పుడే 12.44శాతం సాధించింది. సంవత్సరం పూర్తయ్యే సరికి మన రాష్ట్రం 13శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని న్యాయనిర్ణేతల కమిటీ అభిప్రాయపడ్డింది!

 

తెలంగాణ, ఆంధ్రాలుగా సమైక్యాంధ్ర విడిపోయిన తరువాత ఏపీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే అమరావతి నుంచి పూర్తి స్థాయి అసెంబ్లీ, సెక్రటేరియట్ కార్యకలాపాలు మొదలు పెడుతన్న కొత్త రాష్ట్రానికి స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గొప్ప ప్రొత్సాహం అనే చెప్పుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఇస్తోన్న పారిశ్రామిక ప్రొత్సాహమే అవార్డ్ ఎంపికకు కారణంగా తెలుస్తోంది!