రేపే తెలంగాణ కేబినేట్ భేటీ.. కీలక నిర్ణయాలు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. 

ఇప్పటికే పంచాయతీ రాజ్ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇక మున్సిపల్ యాక్టు అమలులోకి రాబోతుంది. ఇక రెవిన్యూ చట్టంపైనే కసరత్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా రెవిన్యూ చట్టంపైన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రెవెన్యూ చట్టం మొత్తాన్ని కూడా మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావల్సిన అవసరం ఉంటుంది.అదేవిధంగా రెవెన్యూ చట్టం మార్పుతో పాటు దాని కింద పని చేసే ఉద్యోగులకు సంబంధించి విధులు బాధ్యతలు కూడా మారనున్నాయి. వీటన్నిటిపైనా ఒక క్లారిటీ తీసుకోవడంతో పాటు క్యాబినెట్ లో దీనిపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎప్పటి నుంచో లాంచ్ చేయాలనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది అని సమాచారం. 

ఇక పట్టణ ప్రగతి కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే థర్డ్ టీఎంసీ అదే విధంగా కొన్ని కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కూడా ఉన్నాయి. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఏఏకి సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వం వైఖరి తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికైతే కొన్ని కీలక నిర్ణయాలు లేదంటే కొత్త పథకాలకు సంబంధించిన విషయాలు రేపు ఉండబోయే అవకాశమైతే ఉందని సమాచారం. ఆదివారం రోజు సడెన్ గా క్యాబినెట్ పెట్టారంటే ఖచ్చితంగా కొన్ని కీలక అంశాల పై కేబినెట్ లో మంత్రులు, ముఖ్యమంత్రి చర్చించే చాన్స్ ఉందని సమాచారం.