కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా!

 

ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చిన దగ్గరనుండి ఈ విషయంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు వాదనలు జరుపుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇరుక్కున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అసలు ఈ కేసు బయటకు వచ్చినదగ్గరనుండి ఏపీ ముఖ్యమంత్రితో సహా పలు అధికారులు ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని మొత్తుకున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మే చేయలేదంటూ ఎన్నో మాటలు చెప్పింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. దీంతో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీని దెబ్బ తీయాలని చూసిన కేసీఆర్ తను తీసిన గోతిలో తానే పడ్డారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

ఇప్పుడు సర్వీసు ప్రొవైడర్లు ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పడంతో తరువాత ఏం పరిణామాలు చేసుకుంటాయో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా కాల్ డేటా ఇవ్వాల్సిందేనని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. ఇక సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా ఇచ్చిన తరువాత అసలు కథ బయటపడుతుంది. ఇదిలా ఉండగా టీడీపీ నేతలు కేసీఆర్ పై మండిపడుతున్నారు. నారా లోకేశ్ కూడా ఇదే విషయంపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిజం బయటపడింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారి పైన చట్టం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మొత్తానికి అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయిన సర్వీసు ప్రొవైడర్లు ఆఖరికి కేసీఆర్ ను ఇరికించారని తెలుస్తోంది.