జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం...

 

ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఏపీపీఎస్సీ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రెండు వేల ఇరవై జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఉద్యోగాల భర్తీ పై ప్రతి జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లకు కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నాయని కొందరు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

ఏపీపీఎస్సీ పై సీఎం జగన్ సమీక్ష చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా విధానాన్ని కొత్తగా వర్తింపు తీసుకొస్తున్నారు. ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశారు. ఏపీపీఎస్సీ కి ఇప్పటి వరకు పరీక్షలు, ఇంటర్వ్యూ విధానం ఉంది. అయితే ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నేడు సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకి కూడా విడుదల చేయటం జరిగింది. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ప్రతి ఉద్యోగానికి కూడా ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతోంది. అత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి జరగాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. దాన్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో ఉద్యోగాల భర్తీ పై క్యాలెండర్ ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్ష ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన కూడా చేయాలని చెప్పిన పరిస్థితి ఉంది.అంటే అటు ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అదేవిధంగా ఐఐఎం కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ యెక్క భాగస్వామ్యం కూడా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.