టీడీపీతో కలసి జనసేన...

 

వైసీపీ ఆధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్రపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కామెంట్లు విసిరారు. జగన్ 10 లక్షల  కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ముఖ్యమంత్రి కాలేరని... ప్రజలు ఇస్తే వచ్చేది సీఎం పదవి అని చెప్పారు. నేనే సీఎం... నేనే సీఎం అంటూ జగన్ ప్రతిరోజూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని... అవినీతి కేసుల్లో ఉన్న జగన్ ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు వెనక పవన్ కల్యాణ్ పాత్ర ఉందని.. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీతో కలసి జనసేన ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు.