చంద్రబాబు పీఎం... పవన్ ఏపీ సీఎం...

 

‘‘చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు ‘‘మరింత పెద్దహోదా’’లో వుంటే అద్భుత ఫలితాలు ఒనగూరుతాయి’’ ఇప్పుడు ఈ మాటల చుట్టే రాజకీయాల్లో తెగ వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ ఆ మటాలు ఎవరన్నారు... అంతలా చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి అసలు మ్యాటర్. చెప్పింది ఎవరో అల్లా టప్పా మనిషి కాదు.. దేశ రాజకీయాలను శాసించగల వ్యక్తి ముకేష్ అంబానీ. అందుకే ఈ మాటలు అంత హాట్ టాపిక్ అయ్యాయి.

 

అమరావతి సందర్శించడానికి వచ్చిన ముకేష్ అంబానీ నోటి నుండి వచ్చిన మాటలివి. ఇక మరింద పెద్ద హోదా అంటే అందరూ ప్రధాని మంత్రి హోదా అనే ఎవరికి ఎలా నచ్చితే అలా ఊహించుకుంటున్నారు. ముకేష్ అంబానీ భావిస్తున్న ‘‘పెద్ద హోదా’’ ప్రధానమంత్రి పదవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొంతమంది వాదన మాత్రం వేరేలా ఉంది. ప్రస్తుతం మోడీ, చంద్రబాబు ల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. వీరిద్దరి మధ్య రాయబారిగా ముకేష్ అంబానీ వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇవన్నీ ఒకత్తైతే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా బయటకొస్తుంది. అదేంటంటే.. ప్రధానిగా చంద్రబాబు ఇక్కడ ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్ ను కూర్చోబెడతారేమో అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఏదో రాజబారానికి వస్తే ముకేష్ అంబానీ ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదని.. పెద్ద హోదా లాంటి పెద్ద పదాలు వాడారంటే.. ఆయన మాటల్లోని అంతర్గతం ఏంటి రాజకీయ విశ్లేషకలు బుర్రలు బద్దలుకొట్టికొని ఈ ప్రతిపాదనకు వచ్చారు. మోడీ హవా తగ్గిపోయింది. ఆయన చేస్తున్న స్వయంకృతాపరాధనలే ఆయన్ని ముంచేస్తున్నాయి. అందుకే ముకేష్ అంబానీ కూడా చంద్రబాబు లాంటి సమర్ధుడైన నాయకుడు పెద్దహోదాలో ఉండాలని అన్నట్టు భావిస్తున్నారు. ఇక ఇక్కడ ఎలాగూ చంద్రబాబు, పవన్ మధ్య సన్నిహత సంబంధాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అయితే పవన్ ప్రశ్నించడానికి ఎలాంటి సందేహపడరు కానీ... చంద్రబాబు విషయంలో మాత్రం కాస్త ఎందుకో పవన్ కు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కనిపిస్తుంటుంది. అంతేకాదు పవన్ ఏదైనా ప్రభుత్వాన్ని కోరినా... చంద్రబాబు కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలోనే ఒకవేళ ప్రధాని పదవి కనుక చంద్రబాబును ఆశ్రయిస్తే.. ఇక్కడ పవన్ ను సీఎం చేస్తారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

 

చంద్రబాబుకు ప్రధాని మంత్రి అయ్యే అవకాశం గతంలో కూడా వచ్చింది కానీ అప్పుడు ఆయన దానికి సున్నితంగా తిరస్కరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి. ఈసారి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో.... ముందు చూపుతో ఆలోచించే చంద్రబాబు లాంటి సమర్ధవంతమైన నాయకుల అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను వ్యక్తం చేసి వుంటారు. మరి అదే జరిగితే పాపం మోడీ పరిస్థితి ఏంటో...