జేసీ పై చంద్రబాబు సెటైర్.. 'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు'

 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చంద్రబాబునాయుడు సెటైర్ వేశారు. అసలు సంగతేంటంటే.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్తుండగా, లాబీలో ఆయనే జేసీకి ఎదురయ్యారు. దీంతో ఆయన 'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' అంటూ సెటైర్ వేశారు. దీంతో నవ్వుతూ ఆయనతో మాట్లాడేందుకు వెళ్లిన జేసీ, ఆయనతో సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తానెప్పుడూ ఫెయిల్ కానని అన్నారు. బడి ఎగ్గొట్టిన వారు, వెనుక బెంచ్‌ లో కూర్చున్న వారు ఉన్నత స్థానాలకి ఎదిగారని ఆయన అన్నారు.