కాపు రిజర్వేషన్లకు ఆమోదం....


ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లుపై ఆమోదం లభించింది. కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం.. రాష్ట్ర జనాభాలో కాపులు 8.72 శాతం ఉన్నారు... కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ కలిపి 11 శాతం ఉన్నారని చెప్పారు.  బ్రిటీష్ కాలంలో కాపులకు రిజర్వేషన్ ఉండేదని... ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రిజర్వేషన్లను తొలగించారని తెలిపారు. కాపు రిజర్వేషన్ల కోసం 2016లో మంజునాథ్ కమిషన్ వేశాం.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నన్ను ఎవరూ అగడలేదు..కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి అద్యయనం చేసిందని అన్నారు. బీసీలకు అన్యాయం చేయం.. బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీనే లేదని.. టీడీపీకి వెన్నెముక బీసీలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని... కేంద్రం దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి అమలు చేయాలని చెప్పారు.