ప్రత్యేకహోదా ఉద్యమకారుడిపై బీజేపీ కార్యకర్తల దాడి..‍‍‍‍!!

 

కన్నాకు నిరసన సెగలు తగులుతున్నాయి.. అయితే ఆ నిరసనలకు సమాధానంగా బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు.. నెల్లూరు జిల్లా కావలిలో ఓ లారీ డ్రైవర్.. కన్నాపైకి చెప్పు విసిరాడు.. అప్పుడు బీజేపీ నేతలు ఆ వ్యక్తిని తమ చెప్పులు తీసి మరీ కొట్టారు.. ఇప్పుడు ఒంగోలులోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.. ఒంగోలులో కన్నా లక్ష్మినారాయణ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్.. ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ 'ఆంధప్రదేశ్ కు ప్రత్యేకహోదా కావాలి' అనే ఓ ప్లకార్డు ప్రదర్శించారు.. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు తరిమి తరిమికొట్టారు.. కింద పడేసి కాళ్లతో తొక్కారు.. ప్రత్యేకహోదా కోసం నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి మీద దాడి చేయడం ఏంటంటూ బీజేపీ కార్యకర్తల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి.