ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం..తల్లిదండ్రుల ఏకాంతాన్ని వీడియో తీశాడు

సైబర్ నేరగాళ్లు అమాయకులను బుక్ చేయడానికి చాలా రకాల మార్గాలు వాడతారు వాటిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది ఫేస్‌బుక్. ఇప్పటి వరకు కేటుగాళ్ల మాయలో చిక్కుకుని ఎంతోమంది ధన, మాన, ప్రాణాలను పొగొట్టుకున్నారు. వారు ఎలాగో పోతారు...కాని వారి వల్ల కుటుంబం మొత్తం చిక్కుల్లో పడితే..అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫేస్‌బుక్‌కు బానిసగా మారిన ఓ 13 ఏళ్ల కుర్రాడు తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా తన తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్న వీడియోని తీసి అతనికి పంపాడు. అయితే అవతలి వ్యక్తి బ్లాక్ మెయిలర్‌గా మారడంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

 

అసలు వివరాల్లోకి వెళితే బెంగళూరులోని హీరోహళ్లి-ఆంధ్రాహళ్లి రోడ్‌లో నివాసిస్తున్న 13 ఏళ్ల బాలుడు గతేడాది ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచాడు. ఈ క్రమంలో తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి బాలుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అతడు దానిని వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. బాలుడికి అభ్యంతరకర ఫోటోలు పంపడం మొదలెట్టిన తేజల్ పటేల్ చిన్నారిని చైల్డ్ పోర్నగ్రఫీకి అలవాడు చేశాడు. ఆ తర్వాత బాలుడిని మీ పేరేంట్స్ న్యూడ్ ఫోటోలు పంపాల్సిందిగా కోరాడు. అతడి కోరిక కాదనలేకపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసి దానిని తేజల్ పటేల్‌కు పంపాడు.

 

వాటిని అందుకున్న అతను ఇక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోని అడల్ట్ వెబ్‌సైట్‌లో పెడతానని బెదిరించాడు. దీనికి భయపడిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తతతో ఉండాలంటున్నారు పోలీసులు..పిల్లలు గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడపకుండా కాస్ల ఓ కన్నేసి ఉంచాలంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. లేదంటే మీ పిల్లలు చేసిన తప్పు వల్ల మొత్తం కుటుంబమే చిక్కుల్లో పడే అవకాశం ఉందంటున్నారు. సో బీ అలర్ట్.