శిరీష, ఎస్సై... ఇద్దరి సూసైడ్స్‌కు స్పాట్‌ పెట్టింది కుకునూరుపల్లే..!

 

బ్యూటీషియన్‌ శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు కుకునూరుపల్లిలోనే బీజం పడింది. రాజీవ్‌తో తన సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని శిరీష తేల్చేశాక... సమస్య పరిష్కారానికి స్నేహితుడు శ్రవణ్... కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి సాయం కోరాడు. ఈ ముగ్గురి ఫోన్ కాల్స్ ను విశ్లేషిస్తే... కుకునూరుపల్లి కేంద్రంగా జరిగిన పరిణామాలే రెండు ఆత్మహత్యలకు కారణమయ్యాయన్నది నిజం. రాజీవ్, శిరీష, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ సంభాషణలన్నీ కుకునూరుపల్లి టవర్‌ కేంద్రంగానే జరిగాయి. ఈ నలుగురి కాల్స్‌ను కుకునూరుపల్లి టవర్‌ ట్రేస్‌ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే సూసైడ్ కి స్పాట్ పెట్టింది కుకునూరుపల్లే.

 

ఎస్సై ప్రభాకర్‌లోనూ, సన్నిహితుడు రాజీవ్ లోనూ రెండో కోణాన్ని శిరీష అప్పుడే చూసింది. సమస్య పరిష్కరించమంటే ఎస్సై అసభ్యంగా ప్రవర్తించడం... రక్షిస్తారనుకున్న స్నేహితులు ఇద్దరూ తనను చావ బాదడం... ముఖంపైనా, తలపైనా ఎక్కడపడితే అక్కడ శిరీషను కొట్టడం... జుట్టుపట్టి ఈడ్చుకెళ్లడంతో ఆమె షాక్ తింది. తనవాడనుకున్న మనిషి ఇంత దారుణంగా, ఇంత నిర్దయగా ప్రవర్తించడం తట్టుకోలేక పోయింది. నమ్మిన స్నేహితులిద్దరూ ఇలా తమ క్రూరత్వాన్ని బయటపెడితే... కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఎస్సై ప్రభాకర్ తన నిజ స్వరూపం బయట పెట్టాడు.. దాంతో శిరీష తీవ్రమైన అసహనానికి, డిప్రెషన్ కి లోనయింది...అందుకే ఆర్జే స్టూడియోకి రాగానే క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంది.

 

శిరీష సూసైడ్ చేసుకోవడం... ఇష్యూ పెద్దదవడం.. పోలీసుల ఇంటరాగేషన్... మీడియా హడావుడి చూసిన ఎస్సై ప్రభాకర్ భయపడ్డాడు... కేసులో ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందనన్న సమాచారం కోసం బంజారాహిల్స్‌ ఎస్సై హరీందర్‌కు ఫోన్ చేసింది కూడా అందుకే... ఎప్పుడైతే శ్రవణ్ ను విడిగా విచారిస్తున్నారని... కుకునూరుపల్లి తీసుకొస్తున్నారని తెలిసిందో... ప్రభాకర్ కూడా భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్నది పోలీసుల విశ్లేషణ. మొత్తం మీద ఈ రెండు ఆత్మహత్యలకు స్పాట్ పెట్టింది మాత్రం కుకునూరుపల్లె.